Site icon TeluguMirchi.com

సీతక్క దీక్షను భగ్నం చేసిన పోలీసులు

ఇందిరా పర్కా వద్ద దీక్ష చేస్తున్న ఎమ్యెల్యే సీతక్క, ఎన్. ఎస్.యూ.ఐ అధ్యక్షులు వెంకట్ లను అరెస్ట్ చేసి అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో ప్రజారోగ్య ఆమరణ దీక్ష చేసిన సీతక్క, ఎన్. ఎస్.యూ.ఐ వెంకట్ మరియు కార్యకర్తలు. దీక్ష లో సీతక్క, వెంకట్ ల ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు.

ఉస్మానియా ఆసుపత్రిలో సీతక్క, బలమూరి వెంకట్ లకు ఎమ్యెల్యే మాజీ మంత్రి శ్రీధర్ బాబు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శ్రీధర్ బాబు, సీతక్కలతో మాట్లాడి హామీ ఇవ్వడం తో సీతక్క, వెంకట్ దీక్ష విరమించారు.

Exit mobile version