Site icon TeluguMirchi.com

సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. !

lok sabhaపార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి సమైక్య నినదాలతో సభను హోరెత్తిస్తున్న సీమాంధ్ర ఎంపీలపై లోక్ సభలో సస్పెన్షన్ వేటు పడింది. సభ సజావుగా సాగేందుకు రెండు సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పటికినీ ఫలితం లేకపోవడంతో.. సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయాలని మంత్రి కమల్ నాథ్ మరోసారి స్వీకర్ ను కోరారు. దీంతో.. లోక్ సభలో 12 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. ఆర్టికల్ 374ఏ నిబంధన ప్రకారం స్పీకర్ మీరాకుమార్ ఎనిమిది మంది కాంగ్రెస్, నలుగురు టీడీపీ సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌కు నిర్ణయాన్ని తీసుకున్నారు. అనంతరం వెంటనే సభను సోమవారానికి వాయిదా వేశారు. సప్పెన్షన్ గురైన టీడీపీ ఎంపీలు సభలోనే కూర్చుని జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

సస్పెన్షన్ కు గురైన ఎంపీల జాబితాలో లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, అనంత,హర్షకుమార్, మాగుంట, మోదుగుల, ఉండవల్లి, కొనకళ్ల, శివప్రసాద్, నిమ్మల కిష్టప్పతో పాటు సబ్బంహరి, కనుమూరి బాపిరాజు పేర్లను చేర్చారు.కాగా, నిన్న లిస్టులో ఉన్న రాయపాటి పేరును మాత్రం తొలగించారు.

Exit mobile version