టీ-బిల్లుపై మెలిక.. !!

seemandra-central-ministersసీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి చెమటలు పట్టిస్తున్నారు. తమ 10 డిమాండ్లను అంగీకరిస్తేనే.. విభజనకు సహకరిస్తామని లేనియెడల సహాయ నిరాకరణ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. వీరి హెచ్చరికలతో కేంద్రం అయోమయంలో పడింది. టీ-బిల్లును ఈరోజు కేబినేట్ ముందు పెట్టే విషయంలో కూడా వెనకడుగువేస్తోంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు శాంతిస్తేనే.. నేటి కేబినెట్ ముందుకు టీ-బిల్లు వచ్చే అవకాశం వుంది. లేదంటే.. మరింత లేటు అయ్యే అవకాశాలు వున్నట్లు సమాచారం.

ఈరోజు మధ్యాహ్నం జీవోఎం మరోసారి భేటీ అయి సీమాంధ్ర కేంద్ర మంత్రుల డిమాండ్లను పరిశీలించనుంది. అవసరమైతే.. ఈరోజు మరోదఫా సీమాంధ్ర కేంద్ర మంత్రులతో జీవోఎం మంతనాలు సాగించవచ్చు. కాగా, సాయంత్రం 5.30గంటలకు కేంద్రం కేబినేట్ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో.. టీ-బిల్లు కేబినేట్ ముందుకు తీసుకువచ్చే విషయంలో ఉత్కంఠ నెలకొంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు పెట్టిన మెలికతో కాంగ్రెస్ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.