సీమాంధ్ర కేంద్ర మంత్రుల పది డిమాండ్లు ఇవే!!

ministersరాష్ట్ర విభజన విషయంలో.. కేంద్రానికి చుక్కలు చూపిస్తున్నారు సీమాంధ్ర కేంద్ర మంత్రులు. తమ డిమాండ్లను తీర్చని యెడల సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరిస్తున్నారు. మంత్రుల హెచ్చరికల నేపథ్యంలో.. జీవోఎం మరోసారి వారి డిమాండ్లపై ఓ లుక్కేస్తోంది. అసలు.. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రతిపాదించిన డిమాండ్స్ ఏమిటి.. ? అంటే.. అవేవో కొత్త డిమాండ్స్ ఏమికాదు.. ఇదివరకు చేసినవే. అప్పుడు జీవోఎం పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోక తప్పని పరిస్థితి.

సీమాంధ్ర కేంద్ర మంత్రుల డిమాండ్స్ పై ఓ లుక్కేద్దాం :

– రాయల తెలంగాణ
– హైదరాబాద్ ను యూటీ చేయడం
– ఉమ్మడి రాజధానిగా వున్న సమయంలో.. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఇరుప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ
– హైదరాబాద్ లో వైద్య, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పదేళ్ల కాలపరిమితి ఎత్తేయాలి
– పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం
– పోలవరంకు నిర్మాణానికి కేంద్రమే పూర్తి నిధులు మంజూరు.
– రాయల సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
– వైజాగ్ ను రాజధాని చేయాలి (కిశోర్ చంద్రదేవ్ డిమాండ్)
– కొత్త రాజధానిని కేంద్రమే పూర్తి ప్యాకేజీ భరించాలి.