మంత్రులూ.. మెత్తపడ్డారా.. ?

seemandhraరాష్ట్ర విభజనను ఎట్టిపరిస్థితుల్లో ముందుకు సాగనివ్వమని బల్లగుద్ది మరీ చెప్పిన సీమాంధ్ర నేతల స్వరంలో క్రమక్రమంగా మార్పు చోటు చేసుకుంటోంది. విభజనను ముందుకు సాగనివ్వం అని ప్రకటించిన నేతలే ఇప్పుడు సహకరించేందుకు రెడీగా వున్నట్లు కనిపిస్తోంది. ఈ దారిలో కేంద్ర మంత్రులు కొద్దిగా ముందున్నట్లు తెలుస్తోంది. మొన్న.. అధిష్టానం తమ ప్రమేయం లేకుండా.. ముందుకు ఎలా కదులుతోంది..? అని ప్రశ్నించిన నేతలు, నిన్న అసలు అధిష్టానం తమను ఏ మాత్రం పరిగణలోనికి తీసుకోవడం లేదని షో చేశారు. ఇక నేడు.. ఏకంగా జీవోఎంకు నివేదిక ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. జీవోఎంకు అందించే నివేదికలో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని కే్టాయింపు ప్రాంతం.. తదితర అంశాలను సైతం ప్రస్తావించడం విశేషం. విభజన అనంతరం పంపకాలపై ఏర్పడిన జీవోఎంకు నివేదికలు అందించడానికి సిద్ధమైన కేంద్ర మంత్రులు.. ఎట్టకేలకు విభజనను అంగీకరించారనే చెప్పుకొవాలి. అధిష్టానం ఎలాగూ విభజన విషయంలో వెనక్కు వెళ్లే అవకాశం లేనందున.. రాజధాని, ప్యాకేజి తదితర అంశాలపై దృష్టి సారించాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు భావించివుండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మంగళవారం సమావేశమయిన కేంద్ర మంత్రులు జీవోఎంకు పంపే నివేదికపై విస్రృతంగా చర్చించారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ..  16 పేజీల నివేదికను సిద్ధం కూడా చేశారు. దీనిలో పలు కీలక అంశాలను వారు ప్రస్తావించారు. ఆర్టికల్ 371 Dని కొనసాగిస్తూ.. పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని పేర్కొన్నారు. గుంటూరు-విజయవాడ మధ్యలో సీమాంధ్రకు రాజధానిని ఏర్పాటు చేసి.. విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని సూచించారు.

కాంగ్రెస్ అధిష్టానం మెల్లమెల్లగా సీమాంధ్ర నేతలను లొంగదీసుకుంటుంది అనడానికి కేంద్ర మంత్రులే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక మిగిలింది.. సీమాంధ్రకు చెందిన రాష్ట్ర నేతలు.. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చే లోపు వీరు కూడా దారిలోకి వచ్చి సహకరించే అవకాశం వన్నట్లు భావిస్తున్నారు అధిష్టాన పెద్దలు. దానికి పెద్ద ప్లాన్ ను కూడా ప్రిపేర్ చేసినట్టు బోగట్టా. మొత్తానికి, ప్రస్తుతానికైతే.. కేంద్ర మంత్రులు మెత్తపడ్డారు.. ఇక రాష్ట్ర నేతల మిగిలింది రాష్ట్ర నేతలే మరీ..!