Site icon TeluguMirchi.com

సమ్మె సమాప్తం !

ashok babuసమ్మె సమాప్తం !విద్యుత్ ఉద్యోగులతో సీఎం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. విద్యుత్ ఉద్యోగులు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రటించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విద్యుత్ ఉద్యోగులు ఈరోజు (గురువారం) మరోసారి సమావేశమయి చర్చించారు. సమావేశమనంతరం ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సూచన మేరకు, ప్రజల కష్టాలను దృష్టిలో వుంచుకొని సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటం కూడా ఉద్యోగులు సమ్మె విరమించడానికి ఓ కారణంగా చెబుతున్నారు. రేపు ఉదయం 6గంటల నుండి ఉద్యోగులందరు తమ తమ విధులకు హాజరుకావాలని విద్యుత్ ఉద్యోగుల ఐకాస విజ్ఞప్తి చేసింది. అయితే, ఇప్పటి వరకు సమ్మెలో పాల్గొన్న 30వేల మంది శాశ్వత ఉద్యోగులకు, 15వేల కాంట్రాక్టు ఉద్యోగులకు ఐకాస కృతజ్ఞతలు తెలిపింది. మరీ విద్యుత్ ఉద్యోగుల వలనే మిగతా ఏపీ ఎన్జీవోలు సమ్మె ను విరమించాలని ఆశిద్దాం.

Exit mobile version