రేపు సికింద్రాబాద్ – వాస్కోడ గామా మధ్య కొత్త ట్రైన్ ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కొత్త ట్రైన్ సర్వీస్, హైదరాబాద్ నుంచి కర్ణాటక మరియు గోవాకు ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. సికింద్రాబాద్ నుంచి గోవా వాస్కోడ గామాకు చేరుకోవడానికి ఈ కొత్త ట్రైన్ 20 గంటలు సమయం పడుతుంది. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు బయలుదేరి, మరుసటి రోజు 7 గంటల 20 నిమిషానికి గోవా వాస్కోడ గామాకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్, గుంతకల్లు వంటి 20 స్టేషన్ల వద్ద ఆగుతూ గోవాకు చేరుకుంటుంది. టూరిజం కోసం గోవాకు వెళ్లే ప్రయాణికులు ఈ ట్రైన్ సేవలను ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. ఎల్ హెచ్ బీ కోచ్ లతో కలసి, ఈ స్పెషల్ ట్రైన్ లో ఏసీ మరియు నాన్ ఏసీ సౌకర్యాలు అందించబడ్డాయి.