Site icon TeluguMirchi.com

చంద్రబాబుకి షాక్ ఇచ్చిన రహస్య సర్వే.. ఇంతకీ సర్వేలో ఏముంది ?

cm-chandrababu-naidu-meets-japan-pm-shinzo-abe-to-seek-co-operation-on-developing-ap
ఇటీవలే ఏపీలో నిర్వహించిన రహస్య సర్వే అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చిందట. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. పరిస్థితి ఏంటని ఓ ప్రముఖ ఏజెన్సీ సర్వే చేసింది. ఈ సర్వేతో చంద్రబాబు షాక్ కి గురయ్యాడట. అదే జరిగితే.. అధికార టీడీపీ కేవలం 51స్థానాలకే పరిమితం కాబోతుందని సర్వేలో తేలిందట. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సర్వేని రహస్యంగా నిర్వహించింది టీడీపీనే.

స్వయంగా నిర్వహించుకొన్న సర్వేలో తేలిన వాస్తవంతో ముఖ్యమంత్రి చంద్రబాబు షాక్ కి గురయ్యారట. అర్జెంటుగా ప్రభుత్వం, పార్టీలోని కీలక నేతలతో సమావేశమయి రివ్యూ చేశాడట. ఇకపై ప్రజలతో మరింత టచ్ లో ఉండాలని సూచించాడట బాబు. అధికార పార్టీపై అసంతృప్తి స్టార్టయ్యిందని సర్వేలో స్పష్టంగా తేలినట్టు సమాచారమ్. ముఖ్యంగా ముద్రగడ ఏపీసోడ్ చంద్రబాబు సర్కార్ కి విపరీతమైన డ్యామేజ్ చేసిందని చెప్పుకొంటున్నారు.

అంతేకాదు.. చంద్రబాబు మైకు ముందు దంచికొట్టుడు తప్ప.. స్థానికంగా ఏ ఒక్క తెదేపా నేత కూడా ప్రజల కోసం పనిచేయడం లేదని.. స్థానిక టీడీపీ కార్యకర్తలు సైతం ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నట్టు తేలిందట. అవినీతి, నామినేటెడ్ పోస్టుల భర్తీ కాకపోవడం, కరువు.. తదితర అంశాలు చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తికి కారణంగా సర్వేలో తేలింది. మరి.. ఈ అసంతృప్తిని చంద్రబాబు ఏ రకంగా దూరం చేస్తాడన్నది కీలకం. లేదంటే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో పచ్చపార్టీ పరువుపోవడం ఖాయం

Exit mobile version