నగర నేతల రహస్య మంతనాలు !

danamప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దిశగా అధిష్టానం అడుగులు వేస్తోందన్న వార్తల నేపథ్యంలో.. నగర మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ ఈరోజు హైదరాబాద్ లో రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే.. ఎదురయ్యే పరిణామాలే వీరిమధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. మంత్రుల సమావేశంలో మధ్యలో ఎంఐఎం అధినేత అసదుద్గీన్ ఒవైసీతోనూ వీరు సంప్రదింపులు సాగించినట్లు తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం, ప్రత్యేక తెలంగాణ అంశాలను తాము వ్యతిరేకిస్తున్నామని అసద్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే విష్ణువర్థన్ ను సంప్రదించగా 10జిల్లాలతో కూడిన తెలంగాణకు మద్దతిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ అంశంపై రహస్య మంతనాలు జరిపిన మంత్రులు రేపు హస్తిన వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణపై తమ వైఖరిని అధిష్ఠానం పెద్దలకు వివరించాలని వారు నిశ్చయించుకున్నారు. హైకమాండ్ తో భేటీలో హైదరాబాద్ అంశమే ప్రధాన అజెండాగా చర్చించనున్నట్టు సమాచారం.