Site icon TeluguMirchi.com

గాంధీ ఆస్పత్రి సమీపంలో ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న ఎన్జిఓ

గాంధీ ఆస్పత్రి సమీపంలో వేచి ఉన్న రోగులకు ఆక్సిజన్ అందించే సదుపాయాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ కల్పించింది. సోషల్ డేటా ఇనీషియేటివ్స్ ఫోరం అనే వేదిక మూడు ప్రభుత్వ ఆస్పత్రుల ప్రవేశద్వారాల వద్ద రోగుల కోసం మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా ఏర్పాటు చేసింది. అనేక మార్లు అంబులెన్స్ డ్రైవర్లు రోగులను ప్రవేశద్వారం వద్ద దించి వెళ్లిపోతారని అందువల్ల వారికి సక్రమంగా బెడ్ దొరికి చికిత్స ప్రారంభమయ్యే ముందు తాము ఉచితంగా ఆక్సిజన్ సహాయం అందిస్తున్నామని ఎస్డీఐఎఫ్ కి చెందిన ఆజంఖాన్ తెలియచేశారు.

Exit mobile version