Site icon TeluguMirchi.com

రేపటి నుండి ఏపీలో విద్యాసంస్థలు పున ప్రారంభం..

కరోనా కేసుల కారణంగా తెలంగాణలో జనవరి 30 వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడం తో ఏపీలో కూడా ఇదే తరహాలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తారేమో అని అంత అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమి లేదని యధావిధిగా రేపటి నుండి విద్యాసంస్థలు పున ప్రారంభం కాబోతున్నాయని క్లారిటీ ఇచ్చారు మంత్రి సురేష్. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థలను నడిపిస్తామని పేర్కొన్నారు.దీనిపై ఎలాంటి వదంతులు నమ్మకూడదని సూచనలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా.. మరో వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. గత ఏడాది కరోనా విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూల్స్‌, కాలేజీలు మూత పడటంతో ఆన్‌లైన్‌ క్లాసులతో సరిపెట్టుకున్నారు విద్యార్థులు. ఇక తాజాగా ఇప్పుడు థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తోంది. మరి ముందు ముందు ఏంజరుగుతుందో అని అంత ఖంగారుపడుతున్నారు.

Exit mobile version