తెలంగాణ లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది ఈ రోజు నుంచి విధులకు హాజరవుతున్నారు. ఈ నెల 30లోగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను సిద్ధం చేయడానికి బోధన, బోధనేతర సిబ్బంది నేటి నుంచి విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. విద్యార్థులు తప్పనిసరిగా ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలని, విద్యా సంస్థలకు రావాలని ఒత్తిడి తేవొద్దని ఆయా యాజమాన్యాలకు సూచించింది. కోవిడ్ మార్గదర్శకాలను పాటించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేసింది.