బాలల నేర వయసును తగ్గించలేం : సుప్రీం

SCఅత్యాచారం, హత్య లాంటి తీవ్రమైన నేరాల కేసులలో బాల నేరస్థుల వయసును 18 ఏళ్ల నుంచి 16కు తగ్గించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై దారుణ అత్యాచారానికి పాల్పడిన నిందితులలో ఒకడికి వయసు 18 ఏళ్ల కంటే కొన్ని నెలలు మాత్రమే తక్కువ. ఈ కరుడు గట్టిన నేరస్తుడిని న్యాయస్థానం బాల నేరస్థుడిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో అలాంటి కేసులలో నిందితులను జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారించే వయసును 16కు తగ్గించేలా చట్టానికి సవరణలు చేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం 18 ఏళ్ల వయసు సరైనదేనని పేర్కొంది. కాగా, నిర్భయ ఘటనలో అత్యంత క్రూరంగా ప్రవర్థించింది ఈ బాల నేరస్థుడేనని ఇటు పోలీసులతో పాటు తోటి ఖైదులు కూడా చెబుతున్నారు.