Site icon TeluguMirchi.com

ఇక జైలుకెళ్లాల్సిందే..!

sanjay-duttప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముంబై పేలుళ్ల కేసులో జైలులో లొంగిపోవడానికి మరింత సమయం కావాలంటూ… సంజయ్ తరపున తన సినిమా నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు ఈరోజు కొట్టివేసింది. తాము నిర్మించే సినిమాలు నిర్మాణ దశలో ఉన్నందున సంజయ్దత్ లొంగిపోయేందుకు గడువు పొడిగించాలని నిర్మాతలు కోర్టును కోరిని విషయం తెలిసిందే.

1993 ముంబాయి వరుస బాంబుపేలుళ్ల ఘటనలో ఇంకా మూడున్నర సంవత్సరాల జైలు జీవితాన్ని గడపడానికి సంజయ్ ఏప్రిల్ లో లొంగిపోవాల్సింది. అయితే సంజయ్ కోర్టులో లొంగిపోవడానికి కొన్నిరోజుల వ్యవధి కావాలని కోరడంతో.. కోర్టు అతనికి నాలుగు వారాల పాటు బెయిల్ ను పొడగించిన విషయం తెలిసిందే. ఇక సంజయ్ బెయిల్ ను పొడగించడానికి అన్ని దారులు మూసిపోవడంతో.. ఈ నెల 16న ఆయన కోర్టులో లొంగిపోక తప్పని పరిస్థితి.

Exit mobile version