సంజయ్ ఆశ ఆవిరైంది

sanjaydutబాలీవుడ్ నటుడు సంజయ్ దత్ దాఖలు చేసుకున్న శిక్ష మినహాయింపు పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో తనకు విధించిన శిక్షపై సమీక్షించాలని కోరుతూ సంజయ్ ఈ పిటిషన్ వేశాడు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంజూకు ఐదేళ్ల శిక్ష విధించడంతో ప్రస్తుతం పూణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. సంజయ్ దాఖలు చేసిన తాజా క్యూరేటివ్ పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టి వేయడంతో సంజయ్ ఆఖరి ఆశ ఆవిరైంది.