Site icon TeluguMirchi.com

ఆకట్టుకున్న సత్యవాణి ప్రసంగం

sahtavaniశనివారంనాడు లాల్ బహదూర్ స్టేడియం లో జరిగిన సమైక్యాంధ్ర పరిరక్షణ సభ లో ‘ భారతీయం ‘ అధ్యక్షురాలు శ్రీమతి సత్యవాణి ప్రసంగం వేలాదిమంది సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సభ ముగింపులో ఆమె చేసిన ఉపన్యాసం మొత్తం సమావేశానికే హైలైట్ గా నిలిచింది. ప్రేక్షకుల అపూర్వ స్పందనకు, కరతాళ ధ్వనులకు నోచుకున్న ఆమె ప్రసంగం ఇలా సాగింది.

“మనదేశ ప్రధాని అయ్యేందుకు సోనియాగాంధి కి అవకాశం వచ్చింది. అప్పట్లో ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆమె తప్పుకున్నారు. ఈ కోపం ఆమె మనసులో వుంది. ఆ కోపం మనసులో ఉంచుకుని మన దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. తెలంగాణా నాయకులు దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రజల్లో విష బీజాలు నాటుతున్నారు. చంద్రసేఖరన్నా… మమ్మల్ని కర్రీ పాయింట్లు పెట్టుకొమ్మంటున్నావు. కర్రీ పాయింట్లు అంత తేలికా ? నీ భార్య వండుతున్న కూరలు నువ్వు తినడం లేదా ? చింతచెట్టు చిగురు చూడు… ఆంధ్రా అమ్మాయి పొగరుచూడు… అంటూ గోడల మీద రాయించావు…ఇదేనా నీ సంస్కారం ? బతుకమ్మ అంటే అందరికీ బతుకును ఇచ్చే అమ్మ అని అర్ధం… కానీ నీ కుమార్తె ఆ అమ్మను కూడా తెలంగాణా చట్రంలో పెట్టి ఒక ప్రాంతానికి చెందిన దేవతగా తయారుచేసింది. ఎంత పాపం ? కోదండరాం గారూ… మీ పేరులో రాముడిని పెట్టుకుని విద్యార్ధుల మనస్సుల్లో విష బీజాలు నాటుతున్నారు. ఒక ఉపాధ్యాయుడిగా మీలో సంస్కృతి, సంప్రదాయాలు ఏమై పోయాయి ? ” అంటూ సాగిన సత్యవాణి ప్రసంగం ఆద్యంతం అందరిని ఆకట్టుకోవటమే కాక ఆలోచనలో సైతం పడేసింది.

Exit mobile version