ఖైదీ నెంబర్ 16656 !

sanjay-dutt-in-Yerwada-Jailఖైదీ నెంబర్ 16656. ఇది సినిమా పేరు కాదందోయ్! ఎరవాడ జైలు అధికారులు సంజయ్ దత్ కి కేటాయించిన ఖైది నంబరు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో న్యాయస్థానం సంజయ్ కి విధించిన.. ఐదేళ్ల శిక్షలో మిగతా మూడున్నరేళ్ల జైలు జీవితం పుణెలోని ఎరవాడ జైలులో కొనసాగనుంది. అయితే, సంజయ్ కి కేటాయించిన మూడో నంబర్ బ్యారక్ చుట్టూ చాలా చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని జైలు అధికారులు తెలిపారు. స్నేహితుడి ఇంటి నుంచి సంజయ్ దత్ కు ఒక నెలపాటు భోజనం అందుతుంది. కాగా, 2007లో సంజయ్ దత్ ఇదే జైలులో శిక్షను అనుభవించిన విషయం తెలిసిందే.