శైలజానాథ్‌ కు సమైక్య సెగ !

sailajanath-ministerఅనంతపురంలో మంత్రి శైలాజనాథ్ కు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి మంత్రి శైలాజనాథ్ అక్కడకు వచ్చారు. అయితే, సమైక్యవాదులు మంత్రిని అడ్డుకొని.. శైలాజనాథ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సమైక్య సెగతో విస్తుపోవడం మంత్రి పనైంది. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసే వరకు ప్రజాప్రతినిధులను తరిమికొడతామని సమైక్యవాదులు స్పష్టం చేస్తున్నారు.