సరిగ్గా నెల.. !

samiahkya momentసీమాంధ్రలో సమైక్య ఉద్యమ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. సమైక్య ఉద్యమం స్టార్ట్ అయి సరిగ్గా నిన్నటికి నెల కావస్తోంది. జూలై 29న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం ప్రకటన చేసినప్పటి నుంచి మొదలైన సమైక్య ఉద్యమం రోజు రోజుకు రాజుకుంటూ ఉవ్వెత్తునకు ఎగసిపడుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు.. ప్రతి ఒక్కరు సమైక్య నినాదాలతో రోడ్లెక్కుతున్నారు. విన్నూతన ధోరణిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. సమైక్య సెగ తగలని ప్రజాప్రతినిధులు కూడా లేరేమో. ఏ ప్రజాప్రతినిధి వచ్చినా గో బ్యాక్ అంటూ సమైక్యువాదులు హెచ్చరిస్తున్నారు. రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని.. లేదంటే అడ్డుకుంటామని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇక ఏపీ ఎన్జీవోలు తమ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ భవిష్యత్ కార్యచరణలో మునిగిపోయారు. నెల రోజులు గడుస్తున్నా.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచుతామని ఇప్పటి ఎలాంటి హామీ రాకపోవడంతో సీమాంధ్రలో ఉద్యమం ఇంకా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.