Site icon TeluguMirchi.com

సజ్జనార్ ని రెండోరోజు విచారిస్తున్న అధికారులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ అంశానికి సంబంధించి వరుసగా రెండో రోజు విచారణకు సజ్జనార్‌ హాజరయ్యారు. హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు సజ్జనార్‌ సీపీగా పని చేసి చేశారు. సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారిస్తోంది. దీనిలో భాగంగా సంఘటన జరిగిన తర్వాత నిందితులను పట్టుకున్న అంశాలను కమిషన్‌ లేవనెత్తింది. కమిషన్‌ అడిగిన ప్రశ్నకు సజ్జనార్‌ సమాధానాలు చెబుతున్నారు.

Exit mobile version