ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వస్తామని ఆయన సోదరుడు మహేశ్‌బాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం సాయతేజ భౌతికకాయం బెంగళూరుకు చేరుతుందని, అనంతరం బెంగళూరు నుంచి తమ స్వగ్రామానికి రావడానికి సాయంత్రమవుతందని పేర్కొన్నారు. దీంతో సాయితేజ అంత్యక్రియలు రేపు ఉదయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.