ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న సద్గురు మార్చి 17 న పదేపదే వాంతులు మరియు తీవ్ర తలనొప్పి కారణంగా ఢిల్లీలో అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ CT స్కాన్ లో అధిక రక్తస్రావంతో పాటు అతని మెదడులో తీవ్రమైన వాపును కనుకొన్నారు. వెంటనే అదే రోజు అతనికి శస్త్ర చికిత్స చేయగా ఇప్పుడు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.