11 అంశాలపై నివేదిక రూపొందించాం : జైపాల్ రెడ్డి

s jaipalపదకొండు అంశాలపై జీవోఎంకు నివేదికను రూపొందించామని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఢిల్లీ లో టి. కాంగ్రెస్ నేతలతో జరిగిన భేటి అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. విభజన విషయంలో ఏది సాధ్యం, ఏది అసాధ్యమో చర్చించి ఓ నోట్ ను తయారుచేశామని తెలిపారు. టీ.కాంగ్రెస్ తరపున జీవోఎంకు నివేదిక ఇస్తామని చెప్పారు. అనంతరం బంతి ప్రభుత్వం కోర్టులోకి పోతుందని తెలిపారు. భద్రాచలం గురించి జీవోఎంతో సమావేశానికి ముందు మాత్రమే మాట్లాడగలమని అన్నారు. విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ సమస్య ఉంటుందని జైపాల్ అభిప్రాయపడ్డారు. సీమాంధ్రులకు అన్యాయం చేయాలనే ఆలోచన మాకు లేదని జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందేంతవరకు జాతీయ పార్టీలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయమని అన్నారు. దీనికితోడు… తెదేపా, వైకాపాల గురించి కానీ సీమాంధ్ర కాంగ్రెస్ నేతల గురించి కానీ ఇప్పుడు కామెంట్ చేయమని… ఎందుకంటే ఇది సుహృద్భావం నెలకొనాల్సిన సమయమని అన్నారు.