Site icon TeluguMirchi.com

భద్రాచలం మాదే : టీ-మంత్రులు

s jaipalరాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో.. తెలంగాణ కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. జీవోఎంతో.. ప్రధానంగా హైదరాబాద్, భద్రాచలం అంశాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల్లతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయలన్నారు. ఇక, ఏ విధంగా చూసిన భధ్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని జైపాల్ పేర్కొన్నారు. పైగా.. అక్కడి ప్రజలు సైతం తెలంగాణలోనే వుండాలని భావిస్తున్నారు. అందుకు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం చేపడుతున్నట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కూడా ఆయన పలు సూచనలు చేశారు. జీహెచ్ ఎంసీ మొత్తం ఉమ్మడి రాజధాని కాకుండా.. హైదరాబాద్ కార్పోరేషన్ వరకే పరిమితం చేయాలని జైపాల్ డిమాండ్ చేశారు. మరో ఇద్దరు మంత్రులు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. టీ-కేంద్ర మంత్రులు 12పేజీలతో కూడిన వివేదికను జీవోఎంకు అందించారు. అయితే, డిసెంబర్ లోగా తెలంగాణ ప్రక్రియను పూర్తిచేయాలని జైపాల్ కోరారు. విభజన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోనికి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, జీవోఎంతో సమావేశమయిన వారిలో కేంద్ర మంట్రి జైపాల్ రెడ్డితో ఫాటుగా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ వున్నారు.

Exit mobile version