కరోనా వైరస్ కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కొన్ని సడలింపులు చేయడం తో బస్సులను రోడ్ల పైకి ఎక్కించేందుకు కసరత్తులు మొదలుపెడుతున్నారు. అందులో భాగంగా గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో మాత్రమే బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది కూడా నిబంధనలతో కూడిన అనుమతి మాత్రమే ఉన్నది.
సూపర్ లగ్జరీ బస్సుల్లో సాధారణంగా 36 నుంచి 40 సీట్లు మాత్రమే ఉంటాయి. కరోనా కారణంగా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. అందుకోసం రవాణా సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తున్నది. అటు ఇటు ఒక సీటు మాత్రమే ఉంచింది. ఇక మధ్యలో నడిచే ప్రాంతంలో మరో సీటును ఏర్పాటు చేసింది. మధ్యలో ఏర్పాటు చేసిన సీటు ఖాళీగా ఉంటుంది. ప్రయాణికులు అటు ఇటు ఉన్న సీట్లలో మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది. అంటే 20 నుంచి 26 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనుంది.