Site icon TeluguMirchi.com

మందు రేటు పై రోజా కామెంట్

దాదాపు 40 రోజుల తర్వాత ఏపీలో మద్యం అమ్మకాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి

అయితే మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 25 శాతం పెంచేసింది. దీంతో ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. ఆదాయం కోసం ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ మద్యపాన నిషేధంలో భాగంగానే మందు ధరలను పెంచామని చెప్పారు . ధరలు పెంచితేనే పేదవారు మద్యానికి దూరమవుతారని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు.

Exit mobile version