మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా అచ్చెన్నాయుడు ఉండడం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అచ్చెన్నాయుడు అరెస్ట్ ఫై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది.
తాజాగా అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. తప్పు చేశారని రుజువైంది కాబట్టే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఆమె అన్నారు. ఆధారాలతో అరెస్ట్ చేస్తే కిడ్నాప్ చేశారని చంద్రబాబు అంటున్నారని.. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని విమర్శించారు.
తాము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్న రోజా.. గత ప్రభుత్వ హాయాంలో అవినీతి జరిగినట్లు ప్రతీ అసెంబ్లీ సెక్షన్‌లోనూ సీఎం వైఎస్ జగన్ లెక్కలతో నిరూపించారన్నారు. అంతేకాకుండా తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే నిరూపించాలని గతంలోనే లోకేష్ ఓ ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నామని.. అచ్చెన్నాయుడు అరెస్ట్ కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందని రోజా అన్నారు.