Site icon TeluguMirchi.com

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ..

పండగవేళ వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం వల్లాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధువారం ఉదయం కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి.

ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. అయితే బస్సు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Exit mobile version