Site icon TeluguMirchi.com

కరోనా బారిన పడిన ఆర్కే & రాజా

ఏపీలో కరోనా ఉదృతి ఏ రేంజ్ లో కొనసాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు వేలసంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ తాకిడి కేవలం సామాన్య ప్రజలకే కాదు రాజకీయ నేతలకు సైతం తగులుతుంది. ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడగా..తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు కరోనా కు చిక్కారు.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ప్రభుత్వ విప్, తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరు 14 రోజుల పాటు హోమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తమను ఈ మధ్య కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలనికోరారు.

Exit mobile version