రితికేశ్వ‌రీ వ్య‌వ‌హారం పై ప్ర‌భుత్వం సీరియ‌స్

Rishitheshwari-death-mystery
ఆచార్య‌ నాగార్జున యూనివ‌ర్సిటీలో ర్యాగింగ్ కార‌ణంగా అత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన రితికేశ్వ‌రీ వ్య‌వ‌హారం పై ప్ర‌భుత్వం సీరియ‌స్ గా స్పందిం చింది..రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాల‌సుబ్ర‌మ‌ణ్యం నేతృత్వంలో ఒక క‌మిటీని ఎర్పాటు చెసింది..సింహ‌పురి యూనివ‌ర్సిటీ వీసీ ప్రొఫెస‌ర్ వీర‌య్య‌, ఎస్వీ యూనివ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ బాల‌కృష్ణ‌మ‌నాయుడు, ప‌ద్మ‌వ‌తి మ‌హిళ యూనివ‌ర్సిటీ రిజిస్ర్ట‌ర్ ప్రొఫెస‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ ఈ క‌మిటీలో స‌భ్యు లుగా ఉంటారు.. ఈ క‌మిటీ 5 రోజుల‌లో త‌న నివేధిక‌న‌ను రాష్ర్ట ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించ‌నున్న‌ది..రితికేశ్వ‌రీ లాంటి సంఘ‌ట‌న‌లు మ‌రెక్క‌డా పున‌రావృతం కాకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఈ కమిటీ నివేదిక ఇవ్వ‌నుంది..