Site icon TeluguMirchi.com

పవన్ కి ’రివర్స్ పంచ్’ లు.. !!

reverse punches Pawan Kalyan1’జనసేన పార్టీ’ అధినేత పవన్ కళ్యాణ్ రివర్స్ పంచ్ లు మొదలయ్యాయి. రేపటి నుండి నాపై తిట్ల దండకం మొదలవుతుందని పవన్ ముందుగా చెప్పినట్లుగా నేతలు తమ నోటీకి పని చెప్పారు. ఇందులో అత్యధికులు కాంగ్రెస్ నేతలే ఉండటం విశేషం. మరోవైపు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ రాజకీయ అరంగేట్రంను స్వాగతించారు. పవన్ అన్నయ్య, కేంద్ర మంత్రి చిరంజీవి కూడా రివర్స్ పంచ్ లు ఇచ్చిన లిస్ట్ లో వున్నారు.

పవన్ కు రివర్స్ పంచ్ లు ఇచ్చిన నేతలు – వారి మాటల్లోనే :

జనసేన వెనక రహస్య జెండా : పొంగులేటి
‘కాంగ్రెస్ హఠావో… దేశ్ బచావో’ అంటూ పిలుపిచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. వంద మంది పవన్ కల్యాణ్ లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరని అన్నారు.

పవన్ కి రాహుల్ గురించి మాట్లాడే అర్హత లేదు : మల్లు
పవన్ కి రాహుల్ గురించి మాట్లాడే అర్హత లేదని, అతనో పిల్లకాకి అని ధ్వజమెత్తారు మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని పవన్ కల్యాణ్ పిలుపు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమాల్లో సంపాందించిన డబ్బు ను కాపాడుకునేందుకే : కోట్ల
సినిమాల్లో సంపాదించిన డబ్బును కాపాడుకునేందుకే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఉందని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. పవన్ పార్టీ వల్ల రాయలసీమలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఆయన స్పష్ట చేశారు

పవన్ రెండు గంటల సినిమా చూపించాడు : షబ్బీర్ అలీ

రెండు గంటల పాటు పవన్ కల్యాణ్ సినిమా చూపించాడని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. పవన్ కల్యాణ్ కు మానసిక ప్రశాంతత లేదని అన్నాడు. పవన్ కల్యాణ్ లాంటి జోకర్లు ఎంతో మంది వచ్చి వెళ్లిపోయారని ఆయన అన్నారు.

తెలంగాణ పవన్ ప్రభవం జీరో : ఉత్తమ్
పవన్ చిన్న పిల్లవాడని, నిన్న జరిగిన సభలో సినిమా డైలాగులు చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పవన్ ప్రభావం అంతంత మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

పవన్ కల్యాణ్ ఆసుపత్రిలో చేర్పించాలి : కోమటి రెడ్డి
పవన్ కల్యాణ్ ను ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్ది వెంకట్ రెడ్ది. పవన్ మానసిక స్థితి బాలేదని ఆయన ఆరోపించారు.

పవన్ దురదతోనే పార్టీ పెట్టారు : ఆనం
పవన్ కల్యాణ్ నోటి దురదతోనే పార్టీ పెట్టాడని ఆరోపించారు కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్ది. నోటి దురద తీరిపోయిందని, రేపట్నుంచి షూటింగ్ లకు వెళ్లిపోతారని ఆయన తెలిపారు.

పవన్ ఒళ్లు దగ్గరపెట్టుకో : పొన్నం
కాంగ్రెస్ పార్టీని విమర్శించే విషయంలో పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. సీమాంధ్ర సంగతి మాకు అనవసరం, తెలంగాణలో కాంగ్రెస్ ను విమర్శిస్తే తోలు తీస్తామని అన్నారు.

భావోద్వేగం-ఆవేశంతో ప్రజలకు న్యాయం జరగదు : డొక్క
భావోద్వేగాలు, ఆవేశంతో ప్రజలకు న్యాయం జరగదని పవన్ కల్యాణ్ గుర్తించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు. చిరంజీవికి పవన్ కల్యాణ్ స్వంత తమ్ముడైతే తనలాంటి వాళ్లంతా రాజకీయ తమ్ముళ్లమని అన్నారు.

Exit mobile version