హిందువుల మనోభావాలు కేసీఆర్‌ దెబ్బతీశారు

నూతనంగా నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం రాతి స్థంబాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ బొమ్మలు మరియు టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు అయిన కారును చిత్రీకరించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయమై ఇప్పటికే ఆందోళనలు మొదలు పెట్టింది. హిందువుల మత విశ్వాసాలను ఈ సంఘటన దెబ్బ తీస్తుందంటూ కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. తాజాగా ఈ విషయమై ఎంపీ రేవంత్‌ రెడ్డి స్పందించాడు.

సీఎం కేసీఆర్‌ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా ప్రవర్తిస్తున్నారు. యాదాద్రి పుణ్య క్షేత్రంలో రాతి స్థంబాలపై కేసీఆర్‌ చిత్రం మరియు టీఆర్‌ఎస్‌ గుర్తును చెక్కడం దారుణం. దేవాలయంలో రాజకీయాలకు చోటు ఇవ్వడం వల్ల భక్తుల మనోభావాలను దెబ్బ తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే వాటిని తొలగించకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై ప్రభుత్వ వర్గాల నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. కేసీఆర్‌ ఏదైనా అనుకుంటే అది విమర్శలు వచ్చినా కొనసాగిస్తాడు. అలాగే ఇది కూడా కొనసాగించే అవకాశం ఉంది.