మత రాజకీయాలు హానికరం

NCBNభారతదేశం మతాలకు, కులాలకు అతీతమైందని, ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించుకుంటూ ఐక్యంగా ఉంటున్న క్రమంలో కొందరు నాయకులు స్వార్థంతో మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. “వస్తున్నా… మీకోసం” పాదయాయాత్రలో భాగంగా మంగళవారం వరంగల్ జిల్లా మరిపెడ బహిరంగలో ఆయన ఉద్వేగంగా మాట్లాడుతూ… మతాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చగొట్టే రాజకీయాలు చేసేవాళ్లు ఎంతటివారైనా దారిలో పెట్టాల్సిందేనని బాబు సూచించారు.

మతం, కులం అనేది భగవంతుడు పుట్టించింది. మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం శ్రేయస్కరం కాదని, ఇది అశాంతికే దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. రాజకీయాలు హుందాగా, ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని చంద్రబాబు విమర్శించారు.