ఇండియన్ పార్లమెంట్ ఏ రోజు కూడా సజావుగా సాగదనే ఒక మాట ఉంది. చిన్న విషయమో లేదా పెద్ద విషయమో ఏదో ఒక విషయమై సభ్యులు గందరగోళం సృష్టించడం, కొద్ది సమయం లేదా ఎక్కువ సమయం సభ డిస్ట్రబ్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. కాని నేడు రాజ్యసభలో అలాంటివి ఏమీ జరగలేదు. ముందుగా అనుకున్నట్లుగా సభ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సభ సైలెంట్‌గా ప్రజల సమస్యల పట్ల, పరిష్కారం విషయమై చర్చ జరిగింది.
ఇలా జరగడం రాజ్యసభ చరిత్రలో తొలిసారి అని, ఇది చరిత్ర అంటూ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాంతో సభ్యులు అంతా కూడా బల్లాలు చర్చుతు తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. నేడు రాజ్యసభలో మొత్తం పది ప్రశ్నలు చర్చకు వచ్చాయి. అన్నింటికి కూడా అర్థవంతమైన చర్చ జరిగింది. జీరోఅవర్, క్వశ్చన్ అవర్ ఇలా అన్ని కూడా సజావుగా సాగాయి.