RBI : 2వేల రూపాయల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన


చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన 2వేల రూపాయల నోట్లలో 97.62% తమకు చేరాయని, ప్రజల వద్ద ఇంకా మిగిలిన ఆ నోట్ల విలువ 8,470 కోట్లని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా -ఆర్‌బీఐ వెల్లడించింది. 2వేల రూపాయల నోటును చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు గత ఏడాది మే 19న ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఫిబ్రవరి 29న వ్యాపార సమయం ముగిసే నాటికి, ప్రజల వద్ద ఉన్న 2000 రూపాయల నోట్ల విలువ 8470 కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది. 2000 బ్యాంకు నోట్ల చెల్లుబాటును రద్దు చేయలేదని బ్యాంక్‌ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద ప్రజలు ఈ నోట్లను డిపాజిట్ చేయొచ్చని తపాలా కార్యాలయాల నుంచి ఇండియా పోస్ట్‌ ద్వారా నిర్దేశిత ఆర్‌బీఐ కార్యాలయాలకు నోట్లను పంపించి కూడా తమ ఖాతాల్లో జమచేసుకోవచ్చని ఆర్ బి ఐ ప్రకటించింది.