తెలుగుదేశం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు విపరీతమైన ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం రాయపాటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు. గత కొద్దీ రోజులుగా ఇంటికే పరిమితమైన ఈయన..అనారోగ్యానికి గురయ్యారు.
కాగా రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ..బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఫై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసును ఆసరాగా చేసుకుని ఆయనను బెదిరించి.. డబ్బు దోచుకోవాలని చూసిన వ్యవహారంలో చిక్కుముడి వీడుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు.. మలయాళ నటి మరియాపాల్, ఆమె ప్రియుడు సుఖేశ్ చంద్రశేఖర్ లను అసలు సూత్రధారులుగా గుర్తించారు.