రేషన్ కార్డు లేని వారిని అలా వదిలేయోద్దు

లాక్‌డౌన్‌ పై దేశం సరిగ్గా ప్రిపేర్ కాలేదు. విమర్శించడం కాదు. ప్రజలకు కనీసం సమయం ఇవ్వకుండా రవాణ వ్యవస్థని ఆపేశారు. దీంతో చాలా మంది వలసపక్షులుగా మారిపోయారు. ప్రభుత్వాలు కూడా రేషన్ కార్డులు వున్న వారికి రేషన్ అంటుంది. దీంతో వలసపక్షుల నెత్తిన మరో పిడుగుపడింది.

అయితే ఇదే అంశంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పేదలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. అయితే రెషన్‌ కార్డులు లేనివారికీ 10కిలోల ఆహార ధాన్యాలు అందించాలని ఆమె ప్రధానిని కోరారు. అలాగే, లాక్‌డౌన్‌ వల్ల కూలీల వద్ద ఆహార భద్రత కార్డులు ఉండే అవకాశం లేదనీ.. ఆహార ద్రవ్యోల్బణం రాకుండా చూసేందుకే ఈ సూచనలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.