రంజాన్ మాసం ప్రారంభాన్ని పురస్కరించకొని తెలంగాణ హోం మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల పవిత్రతకు అనుగుణంగా తమ జీవితాలను మలచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, మాస్కలను వాడాలని, సామాజిక దూరాన్ని పాటించాలని , అనవసరంగా ఇంటి నుండి బయటకు రావద్దని హోం శాఖా మంత్రి సూచించారు.