భారీ వర్షాలు, వరదలు భాగ్యనగరం హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదవడంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. ముఖ్యంగా పాతనగరం అల్లకల్లోలంగా మారింది. నాలాలు పొంగి పొర్లడం, చెరువులకు గండ్లు పడటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిండీతిప్పలు లేక అవస్థలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ తమ వంతు సాయాన్ని అందజేస్తున్నారు. తాజాగా ఈనాడు గ్రూప్స్ చెర్మన్ రామోజీ రావు ఐదు కోట్ల సాయాన్ని ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నారు.
Ramoji Group Chairman #RamojiRao garu has contributed ₹5 crores to CM relief fund to help flood victims @TelanganaCMO @KTRTRS#HyderabadFloods #TelanganaRains pic.twitter.com/Rodbt2KQ0y— BARaju (@baraju_SuperHit) October 22, 2020