Site icon TeluguMirchi.com

రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

ఈరోజు ( జూన్ 2 ) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. పల్లె , పట్టణం ఇలా అన్ని చోట్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతూ జెండాలు ఎగరవేస్తున్నారు.

ఈ సందర్భాంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యావత్‌ దేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగువారి సొంతమని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్‌ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు.

Exit mobile version