Site icon TeluguMirchi.com

’టీ’ కష్టమేనట!!

ramdev babaభాజాపాకు మద్దతు పలికే బాబా.. రాందేవ్ బాబా. వచ్చే సాధారణ ఎన్నికల్లో భాజాపా తరుపున ప్రచారం చేస్తానని బాహాటంగానే ప్రకటించాడు కూడా. అవకాశం వచ్చినప్పడుల్లా మోడీ జపం చేస్తూ.. కాంగ్రెస్ పై కన్నెర్ర చేస్తుంటాడు. తాజాగా బాబా గారి దృష్టి తెలంగాణ ఏర్పాటు పై పడింది. వచ్చే లోక్ సభ ఎన్నికల లోపు తెలంగాణ ఏర్పాటు కష్ట సాధ్యమేనని జ్యోసం చెప్పాడు. అయితే, తెలంగాణ ఏర్పడటం మాత్రం తథ్యమట.

టీ-పై తన జ్యోస్యం చెబుతూనే కాంగ్రెస్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందేందుకే కాంగ్రెస్ తెలంగాణ గురించి మాట్లాడుతోందని దుయ్యబట్టారు.అయితే, టీ ఏర్పాటు వల్ల వనరులు, ఉద్యోగాలు, ఇతర రంగాలకు సంబంధించినంత అంశాల్లో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగదని రాందేవ్ తెలిపారు. మరీ.. యోగా గురువుకు రాజకీయాలపై గురేమిటో..

Exit mobile version