Site icon TeluguMirchi.com

విజయసాయిరెడ్డి కారుపై దాడి

రామతీర్థం ఘటన ఇప్పుడు రాష్ట్రంలో వేడిని పుట్టిస్తోంది. ఒకేరోజున అన్ని పార్టీల కీలక నేతలు రామతీర్ధం చేరుకోవడంతో ఒక్కసారిగా రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి బోడికొండ మీదకు వెళ్లి వస్తుండగా తెలుగుదేశం కార్య కర్తలు , బిజెపి కార్యకర్తలు అడ్డుకొని ఆయన కార్ ఫై దాడి చేసారు. కొండపైకి వైఎస్సార్‌సీపీ జెండాలతో వెళ్లడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.

ఈ క్రమంలో టీడీపీ,బీజేపీ-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ దాడి లో విజయసాయి కార్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. చెప్పులు, రాళ్లతో దాడికి దిగారు. ఈ తోపులాటలో విజయనగరం బీజేపీ మహిళా నేత కిందపడిపోయారు. మరోవైపు గుడి మెట్లపై వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించారు.. చంద్రబాబును కొండపైకి వెళ్లనిచ్చేది లేదంటున్నారు. ఇటు బీజేపీ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగింది.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మొత్తం మీద రామతీర్థం దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది.

Exit mobile version