స్మశానంలో రామానాయుడు గారు ..

అవును మీరు చదువుతుంది నిజమే, కానీ మేము చెప్పేది మూవీ మొగల్ రామానాయుడు గారి గురించి కాదండోయ్. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారి గురించి.

అసలు విషయం ఏంటంటే పాలకొల్లు లో స్మశాన పునరుద్ధికరణ పనులు చేయడానికి కార్మికులు భయపడ్డ కారణంగా మున్సిపల్ అధికారులు పనిని వదులుకొన్నారు. దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి పనులు చేయకపోవడంతో పునరుద్ధికరణ పనులు ఆలస్యం అవుతున్నాయి .

అందుకు గాను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు కార్మికులు మరియు మున్సిపల్ అధికారుల మనసులో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మూడు రోజులు రాత్రిపూట అక్కడే నిద్ర చేసారు. దీనితో అక్కడ దెయ్యాలు ఏమి లేవని అందరిలో నమ్మకం కలిగించారు. ఇక అక్కడితో నిమ్మల రామానాయుడు గారు సూపర్ హీరో అయిపోయారు.ఇది ఈ నెల 22 తేదీ నుంచి జరిగింది , ఈ విషయం లేటుగా తెలిసిన లేటెస్ట్ న్యూస్ గా వైరల్ అవుతుంది.