పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్లో భారీ ప్రమాదం జరిగింది. ఫేజ్-2 లో బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు క్రాంటాక్టు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు గోదావరిఖని(రాకేష్, ప్రవీణ్), ఒకరు కమాన్ పూర్(రాజేష్), మరొకరు రత్నాపూర్కు చెందినవారుగా గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.