కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కేవలం దేశమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు ఎంతో ప్రయోజనం సాధిస్తున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. భారత్ సూపర్ పవర్ గా ఎదగాలన్న ప్రయత్నం విశ్వకళ్యాణం కోసమే తప్ప ఆధిపత్యం, అజమాయిషీ కోసం కాదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
ఫిక్కీ (FICCI) నిర్వహిస్తున్నవార్షిక సదస్సులో పాల్గొన్న రక్షణ మంత్రి ఒకానొకప్పుడు నిరాశ అంధకారంతో సతమతమైన అనేక రంగాలు మోడీ నేతృత్వంలో ప్రపంచానికి ఆశ,విశ్వాసాన్నిఅందిస్తున్నాయని ఆయన తెలిపారు.భారత్ తయారు చేసే ఉత్పత్తుల కోసం ప్రపంచంలోనే అనేక దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని అన్నారు. గత ఎనిమిదన్నరేళ్లలో భారత్ అర్థ వ్యవస్థ మూడున్నర ట్రిలియన్ డాలర్లకు వెళ్లి ప్రపంచంలోనే 5వ స్థానంలోకి చేరుకుందని ఇది ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని ఉన్నతి అని ఆయన తెలిపారు. రక్షణ, వైద్యం మొదలైన అనేక రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా, ఇతర దేశాలకు సైతం అండగా నిలిచే స్థాయికి చేరుకుందని రాజనాథ్ సింగ్ తెలిపారు