Site icon TeluguMirchi.com

రాజీవ్ సద్భావన బ్రోచర్ విడుదల చేసిన నిరంజన్

రాజీవ్ గాంధి సద్భావనా యాత్రా స్మారక సమితి ఆధ్వర్యములో గత 31 సంవత్సరములుగా జరుగుతున్న రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక సమావేశము ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయము 10.30 గంటలకు చార్మినార్ వద్ద జరుగుతుంది.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇక్కడే స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు, ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి జంట నగరాలలో సద్భావన యాత్రను ప్రారంభించారు.

కర్నాటక రాష్ట్ర మాజీ సి.ఎమ్, మాజీ కేంద్ర మంత్రి డా: ఎమ్. వీరప్ప మొయిలీ గారికి, వారు సామాజిక, రాజకీయ, సాహిత్య రంగాలలో చేసిన సేవకు గుర్తింపుగా సద్భావనా అవార్డును ప్రధానము చేయడము జరుగుతుంది.

ఆయన వ్రాసిన బాహుబలి అహింసా దిగ్విజయమునకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2020 లభించింది. ఆయన కృతి శ్రీ రామాయణ మహాన్వేషనమునకు భారతీయ ఙానపీఠ్ ట్రస్ట్ వారి మూర్తీదేవి అవార్డు తో పాటు సరస్వతీ సమ్మాన్ – 2014 పురస్కారం లభించింది.

ఆయన అధ్యక్షతలో ఉన్న ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి 2017 మరియు 2018 లో సంసద్ రత్న అవార్డ్ లభించినది.

సి.ఎల్.పి. నాయకులు శ్రీ భట్టి విక్రమార్క, పార్లమెంటు సభ్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎ.ఐ.సి.సి కార్యదర్శులు శ్రీ బోస్ రాజు , శ్రీనివాస కృష్ణన్ , మాజీ ఫై పి.సి.సి అధ్యక్షులు శ్రీ వి. హనుమంత్ రావు, శ్రీ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు దామోదరం రాజ నరసింహా, శ్రీమతి గీతా రెడ్డి, శ్రీ మర్రి మర్రి శశిధర్ రెడ్డి, మొహమ్మద్ అలీ షబ్బీర్ , మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ , ఎమ్.ఎ.ఖాన్, మాజీ శాసన సభ్యులు శ్రీ ఎం. కోదండ రెడ్డి, శ్రీ పి.విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.

స్మారక సమితి పదాధికారులు జి.ఆనంద్, జి.కన్నయ్యలాల్, క్రిష్ణ కుమార్,, జి.దినేశ్, మూసా ఖాసిం తదితరులు మీడియా సమావేశములో పాల్గొన్నారు.

Exit mobile version