Site icon TeluguMirchi.com

రజని పార్టీ గుర్తు ‘ఆటో’..?

సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ఎంట్రీ ఖరారు చేసారు. గత కొన్ని నెలలుగా రజనీ పొలిటిల్ ఎంట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణంలో ట్విట్టర్ ద్వారా ఆ ఎదురుచూపులు తెరదించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో పార్టీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.. డిసెంబర్ 31న పార్టీ వివరాలు ప్రకటిస్తామన్నారు. 2021 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ కబురు వచ్చిన దగ్గరి నుండి అభిమానులు , తమిళ ప్రజలు రజనీకాంత్ పార్టీ పేరు ఏంటి..గుర్తు ఏంటి అని ఆరా తీస్తున్నారు.

తాజాగా రజినీకాంత్ పార్టీకి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రజినీకాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కర్చి అని ప్రచారం జరుగుతున్నది. అలాగే రజినీకాంత్ పార్టీకి ఆటో గుర్తు కేటాయించారని సమాచారం. మక్కల్ సేవై కర్చి అంటే ప్రజాసేవ పార్టీ అని అర్ధం. రజినీకాంత్ బాషా సినిమాలో ఆటో డ్రైవర్ గా కనిపించారు. ఆ సినిమా సూపర్ హిట్టైంది. అందుకే ఇప్పుడు తన పార్టీ గుర్తు ఆటో పెట్టుకున్నారని అంటున్నారు. మరి ఇది ఫైనల్ అయినట్లేనా లేదా అనేది చూడాలి.

Exit mobile version