Site icon TeluguMirchi.com

కావేరీ తీర్పు పై రజనీకాంత్ సంచలన కామెంట్స్


దశాబ్దాల పాటు సాగుతున్న కావేరీ నదీ జలాల వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

కాగా తీర్పుపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడుకు కావేరీ జలాలపై ఉన్న వాటాను తగ్గించడం పూర్తిగా నిరాశపరిచిందని రజనీ చెప్పారు. కావేరీ జలాల వాటాను తగ్గించడం వల్ల తమిళనాడులోని చాలామంది రైతులు నష్టపోతారని, తమిళనాడు ప్రభుత్వం కోర్టు తీర్పుపై తగిన రీతిలో ముందుకెళ్లాలనిసూచించారు. రివ్యూ పిటిషన్ వేయాల్సిందిగా ట్వీట్ చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

Exit mobile version