సీఎం కార్ డ్రైవర్ కు కరోనా

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న , పెద్ద , పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరికి ఈ వైరస్ వస్తుంది. ఇప్పటికే ఈ కరోనా బారిన పడి వేలమంది మృతి చెందగా..లక్షల మంది చికిత్స తీసుకోవడం జరిగింది.

తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కారు డ్రైవర్ ను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఇక కారు డ్రైవర్ నివసించే జైపూర్ లోని బజార్ నగర్ లో కర్ఫ్యూ విధించారు. కారు డ్రైవర్ ఎవరెవరిని కలిశారు అనే విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు.