Site icon TeluguMirchi.com

రజనీకాంత్.. అన్నీ ఒకేసారి చెబుతారు

సూప‌ర్ స్టార్ రజ‌నీ కాంత్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. తాజగా ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ ఏడాది తాను సెప్టెంబ‌రు, అక్టోబ‌రుల్లో మ‌రోసారి త‌న అభిమానుల‌తో భేటీ అయి చ‌ర్చిస్తాన‌ని చెప్పారు.

అయితే ఈ సందర్భంగా విలేకరులు అడుగుతున్న కొన్ని లు ప్రశ్నల‌కు స‌మాధానం చెప్పడానికి నిరాక‌రించారు. తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న వెంటనే అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతాని అన్నారు. రజనీ తాజాగా వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఓ హింట్ ఇచ్చారని సంబర పడుతున్నారు.

Exit mobile version